News October 10, 2025
ఖమ్మం: బావిలో జారిపడి మహిళ మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో చోటుచేసుకుంది. పిండిప్రోలు గ్రామానికి చెందిన కాంపాటి ఆశాకుమారి(45) పశువుల మేతకోసం చేను వద్దకు వెళ్లి గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో జారి పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.
Similar News
News October 10, 2025
మైనారిటీ గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ

ఖమ్మం జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ ముజాహీద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఖమ్మం కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
News October 9, 2025
ఈ నెల 23లోగా అభ్యంతరాలు తెలపాలి: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్‌పై ప్రజలు తమ అభ్యంతరాలను ఈ నెల 23వ తేదీలోపు తెలియజేయాలని కలెక్టర్ అనుదీప్ కోరారు. మాన్యువల్ స్కావెంజర్స్ రిహాబిలిటేషన్ చట్టం-2013 ప్రకారం సర్వే కమిటీలు ఏర్పాటు చేయగా, జిల్లాలో స్కావెంజర్లను గుర్తించలేదని కలెక్టర్ తెలిపారు. ఎవరికైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఉంటే కలెక్టరేట్‌లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి (SC Development) కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు.
News October 9, 2025
స్థానిక పోరు.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

స్థానిక సంస్థల ఎన్నికలకు ఖమ్మం జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం అభ్యంతరం చెప్పకపోవడంతో గురువారం(నేడు) MPTC/ZPTC నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమైంది. మొదటి విడుతలో జిల్లాలోని 20 ZPTC స్థానాలకు గానూ 10, 283 MPTC స్థానాలకు గానూ 149 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో ఆశావహుల్లో జోష్ నెలకొంది.