News May 14, 2024
ఖమ్మం: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడులు

తిరుమలయపాలెం మండలం మేడిదపల్లిలోని పోలింగ్ కేంద్రం సమీపంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి వివరించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.
Similar News
News July 6, 2025
ఇందిరమ్మ ఇల్లు రానివారు ఆందోళన చెందొద్దు: ఖమ్మం కలెక్టర్

మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో మంజూరవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నిరుపేదలైన అర్హులకు దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా ఆయా సమీప రీచ్‌ల నుంచి అందిస్తున్నామన్నారు. అటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.
News July 6, 2025
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వం: పొంగులేటి

గత పాలకులు రూ.8.19 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో మరికొన్ని హామీలను కూడా అమలు చేస్తామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్నం బియ్యం పంపిణీ, సన్నాలకు రూ.500 బోనస్, ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి అనేక హామీలను అమలుచేశామన్నారు.
News July 6, 2025
ఖమ్మం: కవిత పర్యటనకు బీఆర్ఎస్ నేతలు డుమ్మా.. కారణమిదేనా?

ఖమ్మం జిల్లాలో ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఆమె పర్యటనలో పార్టీ కీలక నేతలు పువ్వాడ అజయ్, కందాల, సండ్ర, వద్దిరాజు రవిచంద్ర, తాత మధు ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్‌లో తనకు కేసీఆర్ తప్పా మరో లీడర్ లేరని కవిత చేసిన కామెంట్స్ వల్లే ఆపార్టీ నేతలంతా దూరంగా ఉన్నారనేది టాక్. ఆమె పర్యటనలో జిల్లా నేతలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.