News October 23, 2025
ఖమ్మం: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో సీట్ల భర్తీ

జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో డ్రాపౌట్‌ల ద్వారా ఏర్పడిన 40 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత తెలిపారు. 3, 4, 6, 7, 8, 9వ తరగతుల్లో రెసిడెన్షియల్, నాన్-రెసిడెన్షియల్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవంబరు 2వ తేదీలోపు కలెక్టరేట్‌లోని ఎస్-27 విభాగంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News October 23, 2025
కామారెడ్డి: మద్యం దుకాణాల కోసం నేడు తుది గడువు.!

కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం బుధవారం (నిన్న) వరకు 1,449 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు Way2Newsకు తెలిపారు. నేటికి చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య ఈరోజు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని అత్యధికంగా కామారెడ్డి స్టేషన్ పరిధిలోని 15 షాపులకు 450 దరఖాస్తులు వచ్చాయన్నారు.
News October 23, 2025
మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

TG: వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో జరిగే <<17462157>>మేడారం<<>> జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జాతర జరిగే ప్రదేశాన్ని 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించనున్నట్లు అధికారులు తెలిపారు. 1,050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా 24 శాశ్వత, 20 తాత్కాలిక మొబైల్ టవర్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. 12 వేల మంది పోలీసులు జాతరలో విధులు నిర్వహిస్తారని సమాచారం.
News October 23, 2025
సిద్దిపేట: నేటి కేబినెట్ భేటీపై ఆశావహుల ఆశలు

నేడు జరుగనున్న కేబినెట్ భేటీపై ఆశావహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నారు. నోటిఫికేషన్ వెలువరించటానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి విడుదల చేయాలని కోరుతున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే యువతకు రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మళ్లీ వయసు, బాధ్యతలు పెరిగి రాజకీయాలు చేయలేమని అంటున్నారు.