News February 20, 2026

ఖమ్మం: భట్టికి రూ.4.50 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్!

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రూ.4.50 కోట్లతో కొత్త క్యాంప్ ఆఫీస్ నిర్మించనున్నారు. ఖమ్మం పట్టణంలో డిప్యూటీ సీఎం కోసం ఈ క్యాంప్ ఆఫీస్ నిర్మించనున్నారు. భట్టికి ఇది రెండో క్యాంప్ ఆఫీస్ కానుంది. ప్రస్తుతం భట్టి ప్రగతి భవన్‌ను క్యాంప్ ఆఫీస్, నివాసంగా ఉపయోగిస్తున్నారు. అవసరమైన నిధులు, పరిపాలన అనుమతి ప్రభుత్వం ఇచ్చినందున రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ క్యాంప్ ఆఫీస్ నిర్మాణాన్ని చేపట్టనుంది.

Similar News

News February 21, 2026

ప్రెగ్నెన్సీలో TT ఇంజెక్షన్ తీసుకోవచ్చా?

image

తల్లి, బిడ్డకు ధనుర్వాతం (టెటానస్ ఇన్ఫెక్షన్) రాకుండా నిరోధించడానికి ప్రెగ్నెన్సీలో TT ఇంజెక్షన్ కచ్చితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. దీన్ని రెండు డోసులు తీసుకోవాలి. 2/3 నెలలో మొదటి డోస్, ఆ తర్వాత నాలుగు వారాల గ్యాప్‌తో రెండో డోస్ తీసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీకి ముందు మూడేళ్లలో TT ఇంజెక్షన్ తీసుకుంటే బూస్టర్ డోస్ సరిపోతుందని చెబుతున్నారు.

News February 21, 2026

నల్గొండ: ఆందోళన కలిగిస్తున్న మరణాలు

image

నల్గొండ జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఆందోళన కలిగిస్తున్నాయి. మామిడాలలో అప్పుల బాధతో సంతోశ్ ఉరివేసుకోగా, తెట్టకుంటలో మానసికస్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేశ్ గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

News February 21, 2026

రాజకీయ సవాళ్లతో కామారెడ్డిలో హై టెన్షన్!

image

కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈనెల 16వ తేదీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే KVR పై అవినీతి ఆరోపణలు చేయగా, దానికి కౌంటర్‌గా షబ్బీర్ అలీపై ఎమ్మెల్యే ప్రత్యారోపణలు చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోగా, ఎమ్మెల్యే డిగ్రీ కళాశాల ఆస్తులపై, శనివారం బహిరంగ చర్చకు రావాలని పిలుపునివ్వడంతో, ఇరు పార్టీల నాయకులు భారీగా తరలి వెళ్లే అవకాశం ఉంది.