News April 25, 2025
ఖమ్మం: భానుడి ప్రతాపం.. ఈ మండలాల్లోనే అధికం

ఖమ్మం జిల్లాలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. మధిరలో 43.1, KMM(U) ఖానాపురం PS 42.9, కారేపల్లి, కామేపల్లి (లింగాల) 42.8, ముదిగొండ(పమ్మి), సత్తుపల్లి 42.7, రఘునాథపాలెం 42.6, పెనుబల్లి 42.5, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.0, కూసుమంచి 41.9, వైరా 41.8, వేంసూరు, కల్లూరు 41.6, ఎర్రుపాలెం 41.5, కొణిజర్ల, ఏన్కూరు 41.0, KMM (R) పల్లెగూడెంలో 40.3 డిగ్రీలు నమోదైంది.
Similar News
News April 25, 2025
కారేపల్లి: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. దుబ్బతండాకు చెందిన లావుడ్యా భద్రు(52) రెండు ఎకరాలలో మిర్చి, రెండు ఎకరాలలో పత్తి సాగు చేశాడు. పంట సరిగ్గా పండగ పోవడంతో చేసిన అప్పులు తీరవని బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News April 25, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} నేలకొండపల్లిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} వేంసూరు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News April 25, 2025
తెలంగాణ సంక్షేమ పథకాలు ఆదర్శం: మంత్రి తుమ్మల

తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సిన పథకాలు అర్హులకు దక్కడం లేదని, అందుకే కులగణన జరిపామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాజ్యాంగాన్ని అనుసరించి అందరూ సమానమైన హోదాలో ఉండాలని కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 14 నెలల్లో చేసిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రం చేయలేదన్నారు.