News August 14, 2025

ఖమ్మం: భారీ వర్షాలు.. హెల్ప్‌లైన్ నంబర్లు

image

ఖమ్మంలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ ప్రకటించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర సమయాల్లో అందించేందుకు వివిధ హెల్ప్ లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు పోలీసులు ప్రకటన విడుదల చేశారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100, పోలీస్ కంట్రోల్ సెల్ 8712659111, కలెక్టర్ ఆఫీస్ టోల్ ఫ్రీ 1077, సెల్ 9063211298 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు.

Similar News

News November 7, 2025

కూసుమంచి: పంట నష్టం నమోదుకు పడవ ప్రయాణం

image

కూసుమంచి మండలం పాలేరు క్లస్టర్ ఏఈవో సాయిరాం తన వృత్తి నిబద్ధతను చాటారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాలను పరిశీలించేందుకు దారి లేకపోవడంతో, ఆయన ఓ మత్స్యకారుని సహాయంతో పడవపై ప్రయాణించారు. పంట నష్టాన్ని నమోదు చేసి, రైతులకు న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ సాహసం చేసిన ఏఈవో సాయిరామ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి

News November 6, 2025

పీఎం శ్రీ నిధులు సమర్థవంతంగా వినియోగించాలి: ఇన్చార్జ్ కలెక్టర్

image

పీఎం శ్రీ నిధులను అధికారులు సమర్థవంతంగా వినియోగించాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో నిధుల వినియోగంపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపికైన 28 పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, క్రీడా అభివృద్ధి, యూత్ ఎకో క్లబ్ ఏర్పాటు, పరిశ్రమల విజిట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

News November 6, 2025

పోష్, పోక్సో చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: ఇన్చార్జ్ కలెక్టర్

image

పోష్ చట్టం-2013, పోక్సో చట్టం-2012లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ శ్రీజ అన్నారు. గురువారం ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగ స్థలాల్లో మహిళల రక్షణకు పోష్ చట్టం పొందించబడిందని, దీని కింద 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సూచించారు. పిల్లల రక్షణకు పోక్సోలో కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు.