News March 15, 2025

ఖమ్మం: భార్యతో గొడవ.. భర్తను అప్పగించిన పోలీసులు

image

భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లగా మధిర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఖమ్మం 3టౌన్‌కు చెందిన D.శ్రీనివాసరావు గత రెండు రోజుల క్రితం తన భార్యతో గొడవపడి, ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. శుక్రవారం మధిరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శ్రీనివాసరావును కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Similar News

News December 29, 2025

జనవరి 7న ఖమ్మం జిల్లాకు కేటీఆర్‌ రాక

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 7న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లతో ఆయన భేటీ కానున్నారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా పార్టీ శ్రేణులు, నూతన సర్పంచ్‌లకు బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పర్యటనపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

News December 29, 2025

ఖమ్మం: ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే..!

image

తల్లాడ మండలం అంజనాపురం వద్ద జరిగిన ఘోర <<18699919>>రోడ్డు <<>>ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతులు చిల్లర బాలకృష్ణ (కార్ డ్రైవర్), రాయల అనిల్ వీరి స్వగ్రామం జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం ఉప్పుగల్లుగా గుర్తించారు. అటు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులు అజయ్, కొల్లిపాక క్రాంతి, గట్టు రాకేష్‌లది కూడా అదే గ్రామం అని పోలీసులు తెలిపారు.

News December 29, 2025

ఖమ్మం: ’34 ఏళ్ల తరువాత కలుసుకున్నారు’

image

కామేపల్లి మండలం కొమ్మినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఖమ్మంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగింది. దశాబ్దాల తర్వాత ఒకేచోట చేరిన మిత్రులంతా అలనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు కష్టసుఖాలు పంచుకుంటూ, కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు.