News December 13, 2025

ఖమ్మం: భార్యాభర్తలే సర్పంచ్‌, ఉప సర్పంచ్‌

image

బోనకల్‌ పంచాయతీలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోతు జ్యోతి సర్పంచ్‌గా గెలుపొందారు. ఆమె కాంగ్రెస్‌ అభ్యర్థి మంగమ్మపై 932 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇదే పంచాయతీలో జ్యోతి భర్త కొండ ఉప సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన కొండ, ఈసారి రిజర్వేషన్‌‌ జనరల్‌ మహిళా కావడంతో సతీమణిని బరిలో నిలిపి, సర్పంచ్ పీఠాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో సీపీఎం తరఫున జడ్పీటీసీగా గెలిచారు.

Similar News

News April 14, 2026

ఖమ్మం జిల్లాలో పెరిగిన కూలీ రేట్లు

image

ఖమ్మం జిల్లాలో సుతారీ మేస్త్రీలు, సహాయ కార్మికుల కూలీ రేట్లు పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మేస్త్రీ కూలీ రూ.950 నుంచి రూ.1,050కు, సహాయకుల కూలీ రూ.670 నుంచి రూ.735కు పెంచినట్లు డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

News April 14, 2026

KMM: వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, నీరు ఎక్కువగా తాగాలని కోరారు. చిన్నారులు, వృద్ధులు ఎండలో తిరగవద్దని, గొడుగు లేదా టోపీ ధరించాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, తగిన జాగ్రత్తలతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.