News February 24, 2025
ఖమ్మం: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News February 24, 2025
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 26, 27న మహాశివరాత్రి సందర్భంగా సెలవు, 28న అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. మార్చి 1న శనివారం మార్కెట్‌లో మిర్చి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించి సహకరించాలని కోరారు.
News February 24, 2025
డిప్యూటీ సీఎం పీఏ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఏ శ్రీనివాస్ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అయిన ఆయన భట్టి దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై డిప్యూటీ భట్టి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
News February 24, 2025
గుడ్ న్యూస్.. రేపు ఖమ్మంలో జాబ్ మేళా

ఖమ్మం SR&BGNR డిగ్రీ కళాశాలలో ప్లేస్ మెంట్ సెల్, తెలంగాణ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.మహ్మద్ జాకిరుల్లా తెలిపారు. టెక్ మహీంద్రా, జెన్ ప్యాక్ట్, ముత్తూట్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, క్యూస్ కారప్స్ లిమిటెడ్, హెల్త్ కేర్ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.