News December 2, 2025
ఖమ్మం: మమ్మల్ని కాస్త ‘గుర్తు’ పెట్టుకోండి..!

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేడి పెరిగి ప్రచార జోరు సాగుతోంది. గ్రామాల్లో ఉదయం నుంచే అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. గుర్తులు లేకున్నా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గుర్తులు వచ్చాక చెప్తాం కానీ.. మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆశీర్వదించండి’ అంటూ అభ్యర్థిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
Similar News
News April 5, 2026
నరసన్నపేట: కల్తీ ఆహారంపై కనికరమేల..?

నరసన్నపేటలో నాణ్యతలేని ఆహార విక్రయాలు భారీగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మిల్క్ షేక్, హోటల్స్, స్వీట్ స్టాల్స్, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలలో నాణ్యతా ప్రమాణాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల సింగపురంలో జరిగిన కల్తీ బాదంపాలు ఘటన అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
News April 5, 2026
NLG: సెల్‌ఫోన్ పక్కనపెట్టి.. లైబ్రరీకి వెళ్దాం!

స్మార్ట్‌ఫోన్ల వ్యసనంతో పిల్లల్లో పుస్తక పఠనం తగ్గి ఆలోచనా శక్తి దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి సెలవులు, ఒంటిపూట బడుల నేపథ్యంలో పిల్లల సమయం వృథా కాకుండా వారిని గ్రంథాలయాలకు పంపాలని సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండలోని 3 జిల్లా, 64 శాఖా గ్రంథాలయాల్లో ఏకంగా 1,07,951 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు ఈ విజ్ఞాన భాండాగారాలను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి.
News April 5, 2026
వరంగల్: ఎస్సై గారూ.. ఓ లుక్కేయండి..!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఆర్ఎంపీల పేరిట కొందరు తాయత్తులు, మంత్ర తంత్రాలతో ప్రజలను మభ్యపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. దయ్యం, దోషం పేరుతో భయపెట్టి మొదట రూ.500 నుంచి ప్రారంభించి దశలవారీగా రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఇలాంటి మోసాలపై పోలీసులు వెంటనే స్పందించాలని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


