News March 25, 2025
ఖమ్మం: మహిళల కోసం రేపు జాబ్ మేళా..

ఖమ్మంలోని నిరుద్యోగ మహిళలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 26న బుధవారం ఉదయం 10 గంటలకు తనికెళ్ల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. దాదాపు 1,370 ఉద్యోగ ఖాళీల భర్తీకి గానూ 18-30 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ పాసైన మహిళలు అర్హులని, వారికి వేతనం రూ.12వేల నుంచి రూ.18వేల వరకు ఉంటుందని అన్నారు
Similar News
News March 26, 2025
ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట కార్యాచరణ: ఖమ్మం కలెక్టర్

యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన వెయింగ్, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్, టార్ఫాలిన్, గన్ని సంచులు మొదలైన మౌలిక వసతులు ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు.
News March 26, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

∆} కల్లూరును మున్సిపాలిటీగా మారుస్తాం: మంత్రి ∆} ఖమ్మం: కూలీల ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్ ∆} ఖమ్మం: సీతారాముల కళ్యాణానికి 197 ప్రత్యేక బస్సులు ∆} నేలకొండపల్లి: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య ∆} ‘సత్తుపల్లి MLA గారూ మా సమస్యలు ప్రస్తావించండి’ ∆} లంకాసాగర్ క్రాస్ రోడ్డు వద్ద లారీ బీభత్సం ∆} సదాశివునిపేటలో చోరీ.. రూ.2.35లక్షలు చోరీ ∆} ఖమ్మం: బెట్టింగులపై ప్రత్యేక దృష్టి: ఖమ్మం సీపీ
News March 25, 2025
బెట్టింగులపై ప్రత్యేక దృష్టి: ఖమ్మం సీపీ

IPL బెట్టింగులపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని CP సునీల్ దత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో జరిగిన నేర సమీక్షలో CP పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, పోక్సో కేసులలో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ అధికారులతో CP సమీక్ష జరిపారు.