News March 27, 2025

ఖమ్మం: మహిళా మార్ట్ ప్రత్యేకంగా ఉండాలి: కలెక్టర్

image

సాధారణ మాల్స్‌లా కాకుండా మహిళా మార్ట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని సీక్వెల్ రోడ్డులో ఏర్పాటవుతున్న మహిళా మార్ట్ పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఈ మార్ట్‌లో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు తయారుచేసే వస్తువులను విక్రయించనుండగా.. వాటి తయారీ, మహిళా సంఘం సభ్యుల వివరాలతో డాక్యుమెంటరీ ప్రదర్శించాలని తెలిపారు.

Similar News

News March 30, 2025

గాంధీ భవన్‌లో ఉగాది వేడుకల్లో Dy.CM భట్టి

image

హైదరాబాద్ గాంధీ భవన్‌లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.

News March 30, 2025

ఖమ్మం: 488 కేంద్రాలు.. ఆశలన్నీ బోనస్ పైనే!

image

ఉమ్మడి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలో 2.10 లక్షల ఎకరాల్లో వరికి 344, భద్రాద్రి కొత్తగూడెంలో 65వేల ఎకరాలకు గాను 144 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సీజన్‌లోనూ సన్నాలకు బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా, వానాకాలం బోనస్ కొంతమేర పెండింగ్‌లో ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో జమవుతాయని అధికారులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్

News March 30, 2025

పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం.. భట్టిVSపొంగులేటి

image

పాల్వంచ పెద్దమ్మ గుడి పాలకవర్గం నియామకం Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల మధ్య రాజకీయ ఆధిపత్యానికి దారి తీసింది. Dy.CM చొరవతో ఆలయ ఛైర్మన్‌గా జమ్ముల రాజశేఖర్, సభ్యులను నియమిస్తూ మార్చి 6న ఉత్తర్వులు వెలువడ్డాయి. తనకు తెలియకుండా ఎలా నియమిస్తారని మంత్రి సురేఖను పొంగులేటి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరో లిస్టు రెడీ చేశారని.. పాలకవర్గం నియామకం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

error: Content is protected !!