News August 23, 2025
ఖమ్మం మార్కెట్‌లో దొంగ సెస్ బిల్లుల కలకలం

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నకిలీ సెస్ బిల్లులు కలకలం సృష్టించాయి. వివరాలిలా ఉన్నాయి.. మార్కెట్‌లో పత్తి వ్యాపారం చేసే ఒక ట్రేడర్, మరో వ్యాపారి సెస్ పుస్తకాలను దొంగిలించి, వాటిని నకిలీగా ముద్రించినట్లు తెలుస్తోంది. ఆ దొంగ బిల్లులను ఉపయోగించి, గుంటూరులోని ఒక ప్రముఖ సంస్థకు భారీ మొత్తంలో పత్తిని విక్రయించారు. బిల్లులు సరిపోలకపోవడంతో మార్కెట్‌లో విచారించగా, నకిలీ బిల్లుల బాగోతం వెలుగులోకి వచ్చింది.
Similar News
News August 23, 2025
అనకాపల్లి: చీపురు పట్టి శుభ్రం చేసిన ఎస్పీ

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి వ్యర్ధాలను తొలగించారు. ఎస్పీ తుహీన్ సిన్హా స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. పరిశుభ్రతతో అంటూ వ్యాధులు రాకుండా నివారించవచ్చునన్నారు. పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News August 23, 2025
యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

రైతులు అవసరానికి మించి యూరియాను వాడకుండా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్‌లో యూరియా వినియోగంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 18,588 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశామని వెల్లడించారు. ఇంకా 2,405 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News August 23, 2025
రానున్న 2 గంటల్లో వర్షం!

TG: హైదరాబాద్‌లో రానున్న 2 గంటల్లో తేలికపాటి వర్షం పడుతుందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా GHMCలోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు నార్త్, ఈస్ట్ తెలంగాణలోని పలు జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన పడొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.