News August 21, 2025

ఖమ్మం: మీనం.. ఇక అంతా సిద్ధం.!

image

ఖమ్మం జిల్లాలో చేప పిల్లల పంపిణీకి అంతా సిద్ధమైంది. సెప్టెంబర్ ఒకటో తేదీన సరఫరాదారుల నుంచి వచ్చిన టెండర్లు పరిశీలించి, వారి అర్హతలను బట్టి ఖరారు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో రిజర్వాయర్లు, కుంటలు కలిపి 882 ఉండగా, వీటికి 3.49 కోట్ల ఉచిత చేప పిల్లలను సరఫరా చేస్తారు. మూడు నెలలు ఆలస్యమైనా ప్రభుత్వం తమను గుర్తించి ఉచిత చేప పిల్లల సరఫరాకు టెండర్లు విడుదల చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News August 20, 2025

ఖమ్మం: రేపటి నుంచి ‘పనుల జాతర–2025’: కలెక్టర్

image

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జిల్లాలో పూర్తి అయిన పనులకు ప్రారంభోత్సవం, కొత్త పనులకు భూమి పూజ కార్యక్రమాలను రేపటి నుంచి పెద్ద ఎత్తున ‘పనుల జాతర -2025’ను నిర్వహిస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 571 గ్రామాల్లో ఉపాధి హామీ పథకం, ఆర్‌డబ్ల్యూఎస్,పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్&బీ విభాగాల పరిధిలో ప్రారంభోత్సవాలు, భూమి పూజలు నిర్వహించనున్నారు.

News August 20, 2025

ఖమ్మం: వీధి కుక్కల బెడద.. ప్రజల బెంబేలు

image

నేలకొండపల్లి మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రమైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని చెరువు మాదారం, పైనంపల్లి, బుద్ధారం గ్రామాల్లో కుక్కలు పశువులపై, మనుషులపై దాడులకు దిగుతున్నాయని చెబుతున్నారు. ఈ నెలలో కేవలం 20 రోజుల వ్యవధిలోనే 60కి పైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News August 20, 2025

రైతులకు షరతులు పెడుతున్న దుకాణాలపై కేసులు: ఖమ్మం CP

image

యూరియా అవసరాన్ని ఆసరాగా చేసుకొని రైతులకు షరతులు పెడుతున్న 5 ఎరువుల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. బుధవారం నేలకొండపల్లి, చింతకాని, రఘునాథపాలెం, సత్తుపల్లి మండలాల్లోని ఎరువుల దుకాణాలలో పోలీసులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారని చెప్పారు. రైతులు సైతం యూరియా కొనుగోలు సమయంలో దుకాణదారులు ఏమైనా షరతులు పెడితే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.