News January 25, 2026
ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలు.. BRS ఇన్‌ఛార్జిలు వీరే..!

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అధిష్టానం ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఏదులాపురం – ఎమ్మెల్సీ తాతా మధు, మధిర – మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును నియమించారు. అలాగే వైరా – మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సత్తుపల్లి – కె.నాగభూషణం వ్యవహరించనున్నారు. వీరు ఆయా ప్రాంతాల్లో నేతలను సమన్వయం చేస్తూ పార్టీ గెలుపునకు కృషి చేయనున్నారు.
Similar News
News February 3, 2026
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఖమ్మం కలెక్టర్

వైరా మండలం పాలడుగు ఎంపీపీఎస్‌ను కలెక్టర్ అనుదీప్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ఈసీఆర్ 2.0 కార్యక్రమ ప్రగతిపై ఉపాధ్యాయులతో సమగ్రంగా రివ్యూ నిర్వహించారు. మొదటి వారం నుంచి పదో వారం వరకు విద్యార్థుల వారీగా సాధించిన పురోగతిని కలెక్టర్ స్వయంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, వారితో కలిసి భోజనం చేశారు.
News February 3, 2026
ఖమ్మం: నేడు చివరి రోజు..

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మొత్తం 24 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎదులాపురంలో 19, మధిర, వైరాలో రెండేసి, కల్లూరులో ఒకటి చొప్పున ఉపసంహరణలు జరిగాయి. సత్తుపల్లిలో ఎవరూ వెనక్కి తగ్గలేదు. నేడు ఉపసంహరణకు చివరి రోజు కావడంతో మరిన్ని విత్‌డ్రాలు జరిగే అవకాశం ఉంది.
News February 3, 2026
రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్

రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో రబీ ధాన్య సేకరణ, యూరియా పంపిణీ, మునిసిపల్ ఎన్నికలపై సమీక్షించారు. మిల్లర్లకు కొనుగోలుపై ముందే అవగాహన కల్పించాలని, సమస్యలుంటే ముందుగానే పరిష్కరించాలని సూచించారు. అటు యూరియా పంపిణీ వంద శాతం యాప్ ద్వారా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.


