News January 12, 2026

ఖమ్మం: మున్సిపాలిటీల గెలుపుపై మంత్రుల ఫోకస్

image

ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఏదులాపురంలో అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజల్లోకి వెళ్తోంది. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంలో ఒక్కో వార్డుకు ఐదుగురి చొప్పున జాబితా తయారీకి కసరత్తు సాగుతోంది.

Similar News

News February 12, 2026

ఖమ్మం ఆసుపత్రికి మహర్దశ.. కలెక్టర్ చొరవతో కొత్త రోడ్లు

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దశాబ్దం కాలంగా అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లకు మోక్షం లభించింది. కలెక్టర్ ఆదేశాలతో కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, టాయిలెట్ల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టనున్నారు. దీనివల్ల నిత్యం ఆసుపత్రికి వచ్చే 5 వేల మంది రోగులు, సిబ్బందికి దుమ్ము, ధూళి సమస్యల నుంచి విముక్తి కలగనుంది.

News February 12, 2026

5 మున్సిపాలిటీల్లో కట్టుదిట్టమైన బందోబస్తు: ఖమ్మం కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 5 మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఎంట్రెన్స్, ఎగ్జిట్‌లు, వెబ్‌కాస్టింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఏదులాపురం(31), మధిర(22), సత్తుపల్లి(23), వైరా, కల్లూరు (20) వార్డులకు 2 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.

News February 12, 2026

ఖమ్మం: కౌంటింగ్ కేంద్రాల వద్ద BNS 163 అమలు

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని 5 మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. BNS సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, ర్యాలీలు, సభలు, ఐదుగురికిపైగా గుమికూడటం నిషేధమన్నారు. విజయోత్సవాలు, డీజేలు, టపాసులపై నిషేధం విధించారు. అదేరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ముగిసే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు.