News September 20, 2025
ఖమ్మం: మైనారిటీ మహిళలకు 2 కొత్త పథకాలు

మైనారిటీల కోసం తెలంగాణ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రారంభించిందని జిల్లా సంక్షేమ అధికారి మహమ్మద్ ముజాహిద్ తెలిపారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్న కా సహారా పథకాలకు మైనారిటీ, దూదేకుల, ఫకీర్లు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. అక్టోబర్ 6 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడతాయని, ఇతర వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
Similar News
News September 20, 2025
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

వానాకాలంలో ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 326 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 275 సన్నరకాలకు, 51 దొడ్డు రకాలకు ఉంటాయి. నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కొనుగోళ్లు జనవరి వరకు కొనసాగుతాయి. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మాల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
News September 20, 2025
ఖమ్మం: చెల్లని చెక్కు కేసులో ఒకరికి ఆరు నెలలు జైలు శిక్ష

చెల్లని చెక్కుకేసులో వ్యక్తికి 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి తీర్పునిచ్చారు. తీర్పు వివరాలిలా.. ముష్టికుంటకి చెందిన వెంకట్ నారాయణ రఘునాథపాలెంకి చెందిన శేషగిరిరావు వద్ద 2021లో రూ.18లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించే క్రమంలో రూ. 10లక్షల చెక్కును జారీ చేయగా ఖాతాలో నగదు లేకపోవడంతో రిజెక్ట్ అయ్యింది. కోర్టులో కేసు దాఖలు చేయగా జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.
News September 20, 2025
కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాథన్యత ఇవ్వాలి: ఖమ్మం సీపీ

పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. శుక్రవారం ముదిగొండ, బోనకల్, చింతకాని పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శిక్షల శాతం మరింత పెంచేందుకు అత్యున్నత ప్రమాణాలతో కేసుల దర్యాప్తు చేపట్టాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.