News April 13, 2025
ఖమ్మం: రామయ్యా.. చెట్లు ఏడుస్తున్నాయ్.!

‘నీ మరణ వార్త విని నువ్వు నాటిన చెట్టన్నీ నిన్ను చూడటానికి వద్దామనే అనుకున్నాయంట రామయ్య.. కానీ, ఎంతమంది ఊపిరి వదులుతారోనని ఆగిపోతున్నాయంతే’ అని వనజీవి రామయ్య మృతిపై చెట్లు బాధపడుతున్నాయంటూ వర్ణణ SMలో చక్కర్లు కొడుతోంది. పర్యావరణ హితమే ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదని, ప్రకృతికి జీవం పోసి మరణించాడని పుడమి కన్నీటి పర్యంతమవుతుందని పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
పోషకాహారంతో ఆరోగ్యకర జీవనం: ములుగు కలెక్టర్

పోషకాహారంతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. 8వ రాష్ట్రీయ పోషణ్‌లో భాగంగా నెల రోజులు నిర్వహించే కార్యక్రమాలపై ఐసీడీఎస్, హెల్త్, విద్య, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని, పోషకాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. గర్భిణులు, చిన్నారులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు.
News September 16, 2025
విజయవాడ ఉత్సవ్‌కు దుర్గమ్మ సెంటిమెంట్ ఎఫెక్ట్..!

దసరా సందర్భంగా విజయవాడలో నిర్వహించనున్న ఉత్సవ్‌కు దుర్గమ్మ సెంటిమెంట్ ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చే పవిత్ర సమయంలో, సినిమా తారల నృత్యాలు, పాటల కార్యక్రమాలు నిర్వహించడంపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది దుర్గమ్మ ప్రాధాన్యతను తగ్గించడమేనని, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని పలువురు ఆరోపిస్తున్నారు.
News September 16, 2025
ఏటూరునాగారం: రేపు గిరిజన పాఠశాలలకు సెలవు

ఈ నెల 17న పెద్దల పండగ సందర్భంగా ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో గిరిజన సంక్షేమ విద్యా సంస్థల(TW ఆశ్రమ పాఠశాలలు & వసతిగృహాలు)కు సెలవు ప్రకటిస్తూ ఏటూరునాగారం ITDA ప్రాజెక్టు అధికారి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ మేరకు అక్టోబర్ 11న (2వ శనివారం) పని దినంగా పాటించాలని ఆదేశాలిచ్చారు.