News March 22, 2025
ఖమ్మం: రామయ్య తలంబ్రాలకు విశేష స్పందన: ATM రామారావు

ఈనెల 15 న ఆర్టీసీ MD సజ్జనార్ చేతుల మీదుగా ప్రారంభించిన సీతరాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్స్ కు విశేష స్పందన లభిస్తుందని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల కార్గో ATM రామారావు తెలిపారు. ప్రారంభించిన వారం రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 300 బుకింగ్స్ అయినట్లు తెలిపారు. సీతారాముల తలంబ్రాలు కావాల్సినవారు 151 రూపాయి చెల్లించి బుకింగ్ చేసుకున్న వారికి ఇంటి వద్దకే చేరుస్తామన్నారు.
Similar News
News March 23, 2025
ఖమ్మం: ఆడబిడ్డ పుడితే స్వీట్లతో శుభాకాంక్షలు

జిల్లాలో ఆడపిల్ల పుట్టిన ఇంటికి అధికారులు వెళ్లి మిఠాయి బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలని, ‘గర్ల్ ప్రైడ్’ పేరిట ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అమ్మాయి పుట్టడం శుభ సూచకమనే ప్రచారం కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇటీవల దివ్యాంగులకు కలెక్టరేట్లో ఉచిత భోజనం వసతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో కలెక్టర్‌ను అభినందిస్తున్నారు.
News March 23, 2025
ఖమ్మం: రెండో రోజు 34 మంది విద్యార్థుల గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం పదో తరగతి హిందీ పరీక్షకు 34మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ తెలిపారు. మొత్తం 16,386 మంది విద్యార్థులకు గాను 16,352మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. ఎనిమిది పరీక్ష కేంద్రాలను డీఈవో, 37 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.
News March 23, 2025
ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ. 185 ఉండగా, స్కిన్ లెస్ కేజీ రూ.210 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 130 మధ్య ఉంది. కాగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.