News January 6, 2025
ఖమ్మం: రూ.10 కట్టి సర్పంచ్‌గా పోటీ: KA పాల్

సర్పంచ్ అభ్యర్థులకు ప్రజాశాంతిపార్టీ అధినేత KAపాల్ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. టెన్త్ పాసై, రూ.10తో సభ్యత్వం పొందిన ఎవరైనా వచ్చే స్థానికఎన్నికల్లో తమ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేయవచ్చన్నారు. శనివారం ఖమ్మంలో మాట్లాడుతూ.. తమ పార్టీ మద్దతుతో సర్పంచులు గెలిచిన గ్రామాల్లో 100రోజుల్లోనే ఉచిత విద్య,వైద్యం అందిస్తామన్నారు. జిల్లాను అభివృద్ధి చేయలేని భట్టి విక్రమార్క రాజీనామా చేయాలన్నారు.
Similar News
News February 21, 2026
ఖమ్మం: రైతులకు ALERT.. 27 వరకు విక్రయాలు

ఖమ్మం జిల్లాలో 2025-26 సీజన్‌కు సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) పత్తి కొనుగోలు గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఖమ్మం అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లుల్లో ఈ గడువు వరకు కొనుగోళ్లు జరుగుతాయి. రైతులు తమ పత్తిని ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుని విక్రయించుకోవాలని అధికారులు సూచించారు.
News February 21, 2026
బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎంపిక కోసం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు మార్చి 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. స్టేట్/సెంట్రల్ బోర్డు గుర్తింపు, గత ఐదేళ్లలో 7వ, 10వ తరగతుల్లో 90% పైగా ఉత్తీర్ణత, మెరుగైన సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తులు డిప్యూటీ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
News February 21, 2026
ఖమ్మం: బాలకృష్ణ, లోకేశ్‌తో మంత్రి తుమ్మల భేటీ

హైదరాబాదులో జరిగిన ఒక వివాహ వేడుకలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాసేపు కుశలప్రశ్నలు వేసుకుని, వివిధ అంశాలపై ముచ్చటించారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఒకే వేదికపై కలిసిన ఈ దృశ్యం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.


