News February 12, 2025
ఖమ్మం: రూ.91 లక్షలకు వ్యాపారి దివాలా పిటిషన్
ఖమ్మం పట్టణం శ్రీనివాస నగర్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.91,04,593 లకు దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. ఫిర్యాదుదారుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అధిక వడ్డీలకు పలువురి వద్ద అప్పు చేశారు. వ్యాపారంలో తీవ్రంగా నష్టం రావడంతో అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో పదిమంది రుణదాతలను ప్రతివాదులుగా చేరుస్తూ దివాలా పిటిషన్ మంగళవారం స్థానిక కోర్టులో దాఖలు చేశాడు.
Similar News
News February 12, 2025
ఖమ్మం: చెక్‌పోస్టులతో కోళ్ల దిగుమతికి కట్టడి
ఏపీలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు హైలీ పాతోజెనిక్ అవెన్ ఫ్లూయాంజా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. అయితే సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట తదితర మండల్లాలోని పౌల్ట్రీఫామ్‌ల్లోనూ కోళ్లు మృతిచెందగా దీనికి వైరసే కారణమని నిర్ధారణ కాలేదు. కానీ ఏపీ నుంచి కోడిపిల్లలు, కోళ్లు, దాణా దిగుమతి అవుతుండడంతో చెక్‌పోస్టుల ద్వారా అధికారులు వాటిని కట్టడి చేస్తున్నారు.
News February 12, 2025
ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై రాకపోకలు పునరుద్ధరణ
ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై రాకపోకలను పునరుద్ధరించారు. గత సెప్టెంబర్ నెలలో వరదలకు దెబ్బతిన్న వంతెన మరమ్మతులు పూర్తి చేసి, మంగళవారం సాయంత్రం నుంచి వాహన రాకపోకలను అనుమతించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి మాట్లాడుతూ.. వరదల సమయంలో ప్రకాష్ నగర్ వంతెన 9 పిల్లర్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికార యంత్రాంగం ఆధునిక టెక్నాలజీ వినియోగించి పనులు పూర్తి చేసిందన్నారు.
News February 12, 2025
KMM: పారిశుద్ధ్యంపై.. ఆలోచింపజేస్తున్న బొమ్మలు
ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మం కాల్వ ఒడ్డు నుంచి పాత బస్టాండ్ రైల్వే ఫ్లై ఓవర్‌పై క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల కింద గోడల మీద గీసిన పెయింటింగ్ బొమ్మలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ప్రయాణికులు, ప్రజలు వీటిని చూసి బాగున్నాయని కితాబు ఇస్తున్నారు. నగరంలో పారిశుద్ధ్యానికి ప్రజలు తమ వంతుగా పాటుపడాలని కోరుతున్నారు.