News February 26, 2026
ఖమ్మం: రేషన్ అక్రమాలపై విజిలెన్స్ నిఘా

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల శాఖ నిఘా పెంచింది. నెలకు రెండుసార్లు గోదాములు, దుకాణాల్లో తనిఖీలు చేయనున్నారు. బియ్యం దళారులకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు డీలర్ షిప్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం అందేలా పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నామని, అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News February 26, 2026
ఖమ్మం: ప్రతిపక్షాల దాడి.. అధికార పక్షం తడబాటు

వెలుగుమట్ల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. 8 ఏళ్లుగా నలుగుతున్న ఈ అంశంలో రాత్రికి రాత్రి వేలాది మంది పోలీసులతో కూల్చివేతలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కీలక పాత్ర పోషించిన RDO నర్సింహారావు ఆకస్మిక బదిలీ రాజకీయంగా దుమారం రేపింది.
News February 26, 2026
బోయినపల్లి: CMO అధికారిని అంటూ మోసం.. అరెస్ట్

రంగారెడ్డి జిల్లా కుట్లూరు ప్రాంతానికి చెందిన సూర్య ప్రకాష్ బెట్టింగులకు బానిసై అధిక డబ్బు సంపాదించాలని దొంగతనాలకు అలవాటుపడ్డాడు. మోటార్ సైకిల్ దొంగలించిన కేసులో అరెస్టై జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సీఎంఓ కార్యాలయంలో పనిచేస్తానని చెప్పి బోయినపల్లి మిడ్ మానేరు DEE రఘుపతికి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో రఘుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.
News February 26, 2026
సిద్దిపేట: ప్రభుత్వ బడిలో కలెక్టర్ తనిఖీ

సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యాలను కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన నాణ్యతను పరిశీలించిన ఆమె, వంటలను మరింత రుచికరంగా సిద్ధం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. బిర్యానీ, సాంబారు నాణ్యత మెరుగుపరచాలని, వంటగది మరియు డైనింగ్ హాల్‌ను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు.


