News March 18, 2026
ఖమ్మం: రేషన్ బియ్యం పంపిణీపై అదనపు కలెక్టర్ సమీక్ష

ఖమ్మం జిల్లాలోని బఫర్ గోదాముల నుంచి రేషన్ బియ్యం పంపిణీ తీరుపై అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూన్ 2026 వరకు మూడు నెలల కోటాను ఒకేసారి లబ్ధిదారులకు అందించాలన్న కేంద్ర ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 12 గోదాములకు ఇన్‌చార్జిలను నియమించి, సకాలంలో సరఫరా జరిగేలా చూడాలన్నారు.
Similar News
News April 20, 2026
KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.