News July 20, 2024

ఖమ్మం: రైతన్నలకు రుణమాఫీలు అయోమయం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఆధారంగా ఖాతాల్లో నగదు జమ అయిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. అందని వారిలో అయోమయం నెలకొంది. జాబితాలో పేర్లు లేవని గుర్తించిన పలువురు పీఏసీఎస్, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నా ఫలితం కానరావడం లేదు. మాఫీ నిబంధనలు, ప్రక్రియ గందరగోళంగా ఉండడంతోనే ఇలా జరిగిందని రైతులు ఆరోపిస్తిున్నారు.

Similar News

News August 22, 2025

ఫేక్ ప్రచారం చేసే కఠిన చర్యలు తప్పవు: ఖమ్మం సీపీ

image

ఫేక్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఓ దిన పత్రికకు అర్ధం వచ్చేలా డేట్ లైన్ మార్ఫింగ్‌ చేసి తప్పుడు వార్త కథనాన్ని ప్రముఖ దిన పత్రికలో వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుపై ఖమ్మం 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News August 22, 2025

విష జ్వరాలతో అప్రమత్తంగా ఉండండి: ఖమ్మం DMHO

image

సీజనల్ వ్యాధులు, జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి కళావతి బాయి సూచించారు. నీళ్లు నిల్వ ఉన్న చోట, మురుగు ప్రదేశాల్లో లార్వాను అభివృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

News August 22, 2025

కేంద్రంతో కొట్లాడైనా యూరియా అందిస్తాం: పొంగులేటి

image

ఖమ్మం: కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా రాష్ట్రానికి యూరియా కేంటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కావాలనే తప్పుడు లెక్కలు చూపిస్తూ యూరియా కేటాయింపులు చేయడం లేదని, గట్టిగా అడిగితే అదిగో.. ఇదిగో ఇస్తున్నాం అంటూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో కోట్లాడైనా సరే రైతులకు యూరియా సరఫరా చేస్తామని ఆయన పేర్కొన్నారు.