News August 29, 2025

ఖమ్మం: రైల్వే స్టేషన్ సమస్యలపై బీజేపీ చీఫ్‌కు వినతి

image

చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్‌ ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కూర్చోవడానికి బళ్లలు, మంచినీటి సదుపాయాలు, విద్యుత్తు లైట్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, తదితరులున్నారు.

Similar News

News September 1, 2025

మహిళా అభ్యున్నతికి కృషి చేయండి: అదనపు కలెక్టర్

image

మహిళల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఇందిరా మహిళా శక్తిపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, కొత్త స్వశక్తి సంఘాల ఏర్పాటు, బ్యాంకు లింకేజీ రుణాలు, ఏకరూప దుస్తుల కుట్టు పనులు, ఎర్రుపాలెం, కల్లూరులో సోలార్ ప్యానెల్స్, పెట్రోల్ బంక్ ఏర్పాటు వంటి అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు.

News September 1, 2025

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: అదనపు కలెక్టర్లు

image

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. విద్యార్థిని సీటు, రహదారి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, వెలుగుమట్ల చెరువు ఆక్రమణ వంటి సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News August 31, 2025

ఖమ్మం: స్థానిక పోరుకు సమాయత్తం

image

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలుకానుంది. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 571 పంచాయతీల్లో 5,214 వార్డులు, అదే సంఖ్యలో పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ప్రస్తుతం 3,146 బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,572 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేశారు. ఎన్నికల నిర్వహణకు 10,330 మంది అవసరమని తేల్చారు.