News July 16, 2024
ఖమ్మం రోటరీ నగర్‌లో వృద్ధురాలు దారుణ హత్య

ఖమ్మం రోటరీ నగర్‌లో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. అర్ధరాత్రి అమ్మమ్మను మనుమడు కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు. దురలవాట్లకు బానిసైన అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2026
పాలేరు చెరువులోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి దుర్మరణం

ఖమ్మం జిల్లా పాలేరు చెరువులో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఓ కారు వేగంగా చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుడు APకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానిక జాలర్ల సాయంతో కారును బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 14, 2026
సత్తుపల్లిలో.. ఆ భార్యాభర్తలు ఓడిగెలిచారు..!

సత్తుపల్లి ఆ భార్యాభర్తలు ఓడి.. గెలిచినట్లయ్యింది. మాజీ ఛైర్మన్ కూసంపూడి మహేష్ 14వ వార్డులో గెలవగా ఆయన సతీమణి మాధురి ఓడారు. అదేవిధంగా తాజాగా ఛైర్మన్ రేసులో ఉన్న రెహనాబేగం 22లో గెలవగా ఆమె భర్త కమల్ పాషా అపజయం పాలయ్యారు. కాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన సత్తుపల్లి మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్యానల్ 17 అభ్యర్థులతో హస్తగతం చేసుకుంది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో ఆరుగురు మాత్రమే గెలిచారు.
News February 13, 2026
విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దు: ఖమ్మం సీపీ

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ప్రస్తుతం BNSS 163 అమలులో ఉన్నందున.. విజయోత్సవ వేడుకలు, బైక్ ర్యాలీలు, బాణసంచా కాల్చడం, డీజేల వాడకంపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమించి గుంపులుగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని సీపీ కోరారు.


