News September 9, 2025
ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

ఎర్రుపాలెం(M) తక్కెళ్లపాడు గ్రామ చెరువు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఏపీలోని కంచికచర్ల(M) గణాత్కూరుకు చెందిన శ్రీనివాస్-రజినీ దంపతులు బైక్‌పై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కోళ్ల దాణా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 9, 2025
సిర్పూర్: తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్: ఆర్ఎస్పీ

ముఖ్యమంత్రి తెలంగాణ రైసింగ్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు కానీ తెలంగాణ రైసింగ్ కాదు తెలంగాణ ఫాలింగ్ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ అన్నారు. మంగళవారం సిర్పూర్ మండలం చిన్నమాలిని గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి సీతక్క సిర్పూర్ రోడ్లను ఎందుకు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు.
News September 9, 2025
కవిత TDPలోకి వస్తారా? లోకేశ్ ఏమన్నారంటే..

కల్వకుంట్ల కవిత టీడీపీలోకి వస్తారా? అనే ప్రశ్నకు నారా లోకేశ్ స్పందించారు. ‘కవితను టీడీపీలోకి తీసుకోవడం అంటే జగన్‌ను టీడీపీలో చేర్చుకోవడం లాంటిది’ అని వ్యాఖ్యానించారు. తాను KTRను వివిధ సందర్భాల్లో కలిశానని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. NDA అభ్యర్థికి ఓటు ఎందుకు వేశారో జగన్‌ను అడగాలని మీడియా చిట్‌చాట్‌లో అన్నారు.
News September 9, 2025
భద్రాద్రి డీఈవోగా విద్యా చందన

భద్రాద్రి జిల్లా విద్యాధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె జిల్లా విద్యా విభాగానికి సంబంధించిన పరిపాలనా, పర్యవేక్షణా కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. అలాగే పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయుల పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై ఆమె పర్యవేక్షణ చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.