News October 12, 2025
ఖమ్మం: రోడ్డు ప్రమాదంలో ఫొటోగ్రాఫర్ మృతి

తల్లాడ మండలంలోని పినపాక గ్రామం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ ఫొటోగ్రాఫర్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. వైరా వైపు బైక్‌పై వెళ్తున్న కొణిజర్లకు చెందిన ఫొటోగ్రాఫర్ పవన్ (22)ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో పవన్ అక్కడికక్కడే మరణించగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పోలీసులు 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 12, 2025
HYD: ఏఐజీ ఘటనపై ఆసుపత్రి నిర్వాహకుల వివరణ

గచ్చిబౌలిలోని AIGలో జరిగిన ఘటనపై ఆసుపత్రి నిర్వాహకులు వివరణ ఇచ్చారు. లివర్ వ్యాధితో మురళీధర్ ఆస్పత్రిలో చేరాడని, డోనర్స్ ముందుకు రాకపోవడంతో ఆపరేషన్ ఆలస్యమైందన్నారు. కుటుంబసభ్యుల అంగీకారంతో ఆపరేషన్ నిర్వహించామని, అనంతరం ఆరోగ్యం మళ్లీ విషమించడంతో ICUకి షిఫ్ట్ చేశామన్నారు. ఇదే సమయంలో కుటుంబసభ్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్తామంటే డిశ్చార్జ్ చేశామని, అతడు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పినా వినలేదన్నారు.
News October 12, 2025
HYD: CM బోటీ అమ్ముతుండా?: KTR

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు KCRను గెలిపించుకోవాలని KTR పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే BRS జైత్రయాత్ర మొదలవ్వాలన్నారు. 2 ఏళ్లు అభివృద్ధిని పక్కన బెట్టిన రేవంత్ KCRను తిట్టుడే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ‘గుడ్లు పీకి గోలిలాడుతా.. పేగులు మెడలేసుకుంటా అంటుండు. CM బోటీ ఏమైనా అమ్ముతుండా’ అని KTR సెటైర్లు వేశారు. కారు కావాలా? బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.
News October 12, 2025
రాశులు చెబుతున్న జీవిత పాఠాలు

మేషంలా తినాలి.
వృషభంలా పౌరుషాన్ని ప్రదర్శించాలి.
మిథునంలా కలసిపోవాలి.
కర్కాటకంలా పట్టు విడవకూడదు.
సింహంలా పరాక్రమించాలి.
కన్యలా సిగ్గుపడాలి.
తుల లాగా సమన్యాయం పాటించాలి.
వృశ్చికంలా చెడుపై కాటేయాలి.
ధనస్సులా లక్ష్యాన్ని ఛేదించాలి.
మకరంలా దృఢంగా పట్టుకోవాలి.
కుంభంలా నిండుగా ఉండాలి.
మీనంలా సంసారసాగరంలో జీవించాలి.