News December 21, 2025
ఖమ్మం: లారీని ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి, 36 మందికి గాయాలు

తిరుమలాయపాలెం(M) చంద్రుతండా వద్ద KMM- WGL NHపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని RTC సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ నితీష్ అక్కడికక్కడే మృతి చెందగా.. బస్సులో ఉన్న 36 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ACP తిరుపతిరెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI జగదీష్ తెలిపారు.
Similar News
News December 23, 2025
HYD: నేడో, రేపో డీ లిమిటేషన్ ఫైనల్

GHMCని 300 వార్డులుగా పునర్విభజన చేస్తూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను GHMC యంత్రాంగం పరిగణలోకి తీసుకొని మార్పులు, చేర్పులు చేసింది. దీనికి అనుగుణంగా ఫైనల్ నోటిఫికేషన్ ప్రభుత్వ ఆమోదంతో నేడో, రేపో వెలువడే అవకాశం ఉంది. కాగా, కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని తుది నివేదికను సోమవారం ప్రభుత్వానికి అధికారులు పంపించారు.
News December 23, 2025
మేడారం: ఇంకా 36 రోజులే.. SLOWగా పనులు..!

మేడారం జాతరకు మరో 36 రోజులే గడువు ఉంది. సాధారణంగా జాతరకు 15 రోజుల ముందు నుంచే అమ్మవార్లను దర్శించుకునేందుకు జనం వస్తుంటారు. కాగా, జాతర ప్రాంతంలో అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతన్నాయి. మరోపక్క మేడారానికి చేరుకునే రోడ్లపై ఉన్న వంతెనలు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సమ్మక్క మాల ధరించి మరీ అధికారులుందరూ ఇక్కడే ఉండి జాతర పనులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినా అలాంటి పరిస్థితేమీ కన్పించట్లేదు.
News December 23, 2025
TPT: అన్యమతస్థులతో గోవిందరాజస్వామి ఆలయ పనులు..?

గోవిందరాజస్వామి ఆలయం విమాన గోపురం బంగారు తాపడం పనులు కాంట్రాక్టర్ జ్యోత్ టెండర్ ద్వారా దక్కించుకుని మరో ఇద్దరు అన్యమతస్థులకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే వారికి ఎలాంటి రాతపూర్వకంగా ఇవ్వలేదని విజిలెన్స్ అధికారులు తేల్చారు. కాగా పనుల్లో అవకతవకలు, విగ్రహాలు తొలగించడంపై హిందూ సంఘాలు ఆరోపణల చేశాయి. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.


