News February 1, 2025

ఖమ్మం: వన మహోత్సవం @ లక్ష మొక్కలు

image

వన మహోత్సవం 2025-26లో భాగంగా కేఎంసీలో మొక్కలను సిద్ధం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. శుక్రవారం ఖమ్మం నగరంలోని గొల్లగూడెంలో ఏర్పాటు చేసిన నర్సరీని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రారంభించారు. లక్ష మొక్కలు పెంచేందుకు పనులను ముమ్మరం చేశారు. మొక్కల పెంపకం కోసం కవర్లల్లో మట్టి నింపడం..విత్తనాలు విత్తడం.. మొక్కల సంరక్షణ పక్కాగా కొనసాగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News January 31, 2025

గొంగడి త్రిష సూపర్ ఫామ్ కంటిన్యూ

image

భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష అండర్ -19 టీ20 ప్రపంచ్ కప్‌లో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులతో రాణించి గెలుపులో కీలకంగా మారింది. కాగా ఇటీవల స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీ20ల్లోనే తొలి సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఫైనల్‌లోనూ ఉత్తమ క్రీడా ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

News January 31, 2025

బోనకల్ ఘటనపై పొంగులేటి దిగ్భ్రాంతి

image

బోనకల్ సమీపంలోని సాగర్ కెనాల్ వద్ద ట్రాక్టర్ బోల్తాపడి ఒక మహిళా కూలీ మృతి చెందగా, పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వైద్యులను ఆదేశించారు.

News January 31, 2025

ఖమ్మం: విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకే శిక్షణ: DEO

image

విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడం, వారిలో భయాన్ని పోగొట్టేలా బోధించేందుకే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నట్లు DEO సోమశేఖరశర్మ తెలిపారు. ఖమ్మం డైట్లో ‘కెరీర్ కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్’ పేరిట ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.