News July 30, 2024
ఖమ్మం: వరదలో టిప్పర్.. రాత్రంతా చెట్టుపైనే డ్రైవర్

చింతూరు మండలం నిమ్మల గూడెం రహదారి మలుపు వద్ద సత్తుపల్లి నుం వస్తున్న టిప్పర్ అర్ధరాత్రి వరద నీటిలో చిక్కుకుంది. డ్రైవర్ మర్రి నవీన్ పక్కనే ఉన్న తాటి చెట్టుపైకి ఎక్కి రాత్రంతా ఉండిపోయాడు. ఆ గ్రామానికి చెందిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో బోటుపై వెళ్లి డ్రైవర్‌ను సోమవారం ఒడ్డుకు తెచ్చారు. అతను నిడదవోలుకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.
Similar News
News September 15, 2025
పటిష్టం..’పాలేరు’

1928లో పాలేరు చెరువు నిర్మించారు. నాటీ చీఫ్ ఇంజీనీర్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ పర్యవేక్షణలో చతురస్రాకారం బండరాళ్లు, బంకమట్టి, డంగుసున్నం, కాంక్రీట్ లాంటి సీసంతో నిర్మించారు. చెరువు నుంచి నేటికీ చుక్క నీరు కూడా లీక్ కాకపోవడం నాటి ఇంజీనీర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పొచ్చు. పాలేరు చెరువు 1978లో రిజర్వాయర్‌గా మారినప్పుడు ఇంజీనీర్లు ఫాలింగ్ గేట్లు ఏర్పాటు చేసి ఘనత సాధించారు. నేడు ఇంజీనీర్స్ డే.
News September 15, 2025
ఖమ్మం: ఐదేళ్ల పోరాటం.. నూతన సొసైటీ ఏర్పాటు

నేలకొండపల్లి మండలంలోని అప్పలనర్సింహాపురం మత్స్యపారిశ్రామిక సంఘం నూతనంగా ఏర్పాటైంది. గ్రామంలోని చెరువుకు సొసైటీ ఏర్పాటు చేసి మత్స్యకారుల అభివృద్ధికి సహకరించాలని వారు గత ఐదేళ్లుగా పోరాటం చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం మత్స్యశాఖను గుర్తించి, గ్రామానికి చెందిన 64 మందికి సభ్యత్వంను అందించారు. కొత్త సొసైటీ ఏర్పాటుపై ఆదివారం మత్స్యకారులు చెరువు వద్ద సంబురాలు నిర్వహించారు.
News September 14, 2025
‘టీజీఈ హైట్స్ ప్రాజెక్టు విజయవంతం చేయండి’

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు TGE హైట్స్ ప్రాజెక్టును విజయవంతం చేయాలని TGO రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఖమ్మం పోలేపల్లిలోని రాజీవ్ స్వగృహ నందు ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి టెండర్ దక్కినందుకు సమావేశం నిర్వహించారు. CM రేవంత్, జిల్లా మంత్రుల సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ ధరలో గృహ సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్టు సాధించుకున్నామన్నారు.