News December 31, 2024
ఖమ్మం: వరద బాధితులకు పదో తరగతి సర్టిఫికెట్లు విడుదల
ఖమ్మం మున్నేరువాగు ప్రాంతాల్లో వరదల్లో పదో తరగతి సర్టిఫికెట్లు కోల్పోయి.. జిల్లా విద్యా మరియు జిల్లా విద్యాధికారి కార్యాలయం ఖమ్మం నందు వివరాలు నమోదు చేసుకున్న వారి డూప్లికేట్ పదో తరగతి సర్టిఫికెట్స్ జిల్లా విద్యాధికారి కార్యాలయంలో వచ్చాయని వారు ప్రకటనలో తెలిపారు. కావున సంబంధిత అభ్యర్థులు ఆధార్ కార్డ్, ఒక జిరాక్స్ కాపీతో స్వయంగా జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 3, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం& భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వే ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో వేలంపాట ∆} ములకలపల్లి లో ఎమ్మెల్యే జారే పర్యటన ∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News January 3, 2025
ముక్కోటి ఉత్సవాలు.. భద్రాద్రిలో ఈరోజు ఇదే స్పెషల్..!
భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా మొదలైన విషయం తెలిసిందే. ఈరోజు(శుక్రవారం) రామయ్య నరసింహ అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ అవతారంలో స్వామివారిని దర్శిస్తే రాహు గ్రహ బాధల నుంచి విముక్తులవుతారని ప్రతీతి. జనవరి 9న సాయంత్రం 4 గంటలకు గోదావరిలో తెప్పోత్సవం, 10న తెల్లవారుజామున ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది.
News January 3, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు (శుక్రవారం) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పీఏ రాఘవరావు ఓ ప్రకటన విడుదల చేశారు. సుజాతనగర్, పాల్వంచ, లక్ష్మీదేవి పల్లి, కొత్తగూడెం, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, అధికారులు గమనించాలని పేర్కొన్నారు.