News February 23, 2025

ఖమ్మం: వారం రోజుల వ్యవధిలో అత్తా, కోడలు మృతి

image

వారం రోజుల వ్యవధిలో అత్తా, కోడలు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. మద్దివారిగూడెంకు చెందిన వీరవెంకటమ్మ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ 4రోజుల క్రితం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు పూర్తికాగా, అప్పటికే క్యాన్సర్‌‌తో బాధపడుతున్న వీరవెంకటమ్మ కోడలు కృష్ణవేణి సైతం శనివారం మృతి చెందింది. వారం వ్యవధిలోనే అత్తాకోడళ్లు మృతి చెందడంతో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

Similar News

News February 23, 2025

‘రాజా సాబ్’ మూవీపై క్రేజీ న్యూస్ వైరల్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజా సాబ్’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాప్ మోస్ట్ కమెడియన్స్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిశోర్, సప్తగిరి, గెటప్ శ్రీను, యోగిబాబు, వీటీవీ గణేశ్‌ తదితరులను డైరెక్టర్ మారుతి తీసుకున్నట్లు టాక్. వీరి కోసం స్పెషల్ స్క్రిప్ట్ రాసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 10న మూవీ విడుదల కానుంది.

News February 23, 2025

కొమురవెల్లిలో కొనసాగుతున్న హాల్ట్ స్టేషన్

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైల్వే హాల్ట్ స్టేషన్ శరవేగంగా కొనసాగుతోంది. 2024, జనవరి 20న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ పాల్గొని భూమి పూజ చేశారు. కాగా ప్రస్తుతం 75% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే పనులు పూర్తై అందుబాటులోకి రానుంది.

News February 23, 2025

GWL: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

image

ఉమ్మడి ఇటికాల మండలంలోని గురుకుల పాఠశాలల్లో ఆదివారం జరిగిన 2025 పీజీ సెట్ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఆదివారం గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరు, కేంద్రాల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపల్ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!