News January 25, 2026
ఖమ్మం: వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. పోటీకి సై..!

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి సాగేందుకు సీపీఐ పావులు కదుపుతోంది. వైరా(2), మధిర(3), ఇల్లందు(3), అశ్వారావుపేట(3), సత్తుపల్లి(1) వార్డుల్లో పోటీ చేసేందుకు సిద్ధమని వామపక్ష నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూలంగా స్పందిస్తే.. ఉమ్మడి జిల్లాలో ‘హస్తం-ఎర్రజెండా’ పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంది.
Similar News
News April 3, 2026
మేడ్చల్: వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. కూకట్‌పల్లిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO ఉమాగౌరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు అంకితభావంతో పని చేయాలన్నారు. రోగుల వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, కాలం చెల్లిన మందులపై జాగ్రత్త వహించాలని ఆదేశించారు.
News April 3, 2026
పేర్ని నానిపై పెట్టిన సెక్షన్లు ఇవే..!

మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. మచిలీపట్నం కొబ్బరితోటలో ఓ అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో పేర్ని నాని పరామర్శ పేరుతో అక్కడకు వచ్చి మీడియా ముందు పోలీసులను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులను బహిరంగంగా బెదిరించడంతోపాటు ఇనగుదురు సీఐ బాడీని షేమింగ్ చేస్తూ పేర్ని మాట్లాడారు. దీనిపై పోలీసులు ఆయనపై BNS 196, 353(2), 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
News April 3, 2026
మరో వివాదంలో IAS రోహిణి సింధూరి!

IPS రూపాపై <<10034506>>ఆరోపణలతో<<>> వార్తల్లో నిలిచిన IAS రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై FIR నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. 2021లో మైసూర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉండగా ₹13 కాటన్ బ్యాగులను ₹52కు కొనడంతో ₹7.65 కోట్ల నష్టం వచ్చిందనే ఆరోపణలున్నాయి. ఆమెపై కేసు పెట్టాలని రవిచంద్రే గౌడ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆయన HCని ఆశ్రయించారు.


