News February 19, 2025
ఖమ్మం: వాహనం ఢీకొని యువకుడు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 20, 2025
BREAKING: కొత్తగూడెం: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు!

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి పట్టుబడ్డ ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి శంతన్ కుమార్ రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో సాయి శాంతన్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
News February 20, 2025
ఖమ్మం: తహశీల్దార్ ఆఫీస్ ఎదుట వృద్ధురాలి ఆవేదన

ఖమ్మం జిల్లా మధిర తహశీల్దార్ కార్యాలయం ఎదుట దెందుకూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు కనకపూడి కరుణమ్మ(85) ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు. ‘ఆక్రమణకు గురైన నా స్థలామైనా ఇప్పించండి.. లేదా నేను చనిపోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అని రాసిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆఫీస్ ముందు బైఠాయించారు. ఆమె మాట్లాడుతూ.. తన స్థలం కోసం తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయానన్నారు. మల్లు నందిని అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు.
News February 20, 2025
ఖమ్మం: హోంగార్డ్ నరేశ్ మృతి.. కారణం ఏంటి?

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని డిగ్రీ కాలేజ్ సమీపంలోని మినీ హైడల్ పవర్ ప్రాజెక్టు వద్ద సాగర్ కాలువలో హోంగార్డ్ నరేశ్(36) <<15520402>>మృతదేహం కలకలం<<>> సృష్టించిన విషయం తెలిసిందే. ఉదయం కాలువలో నరేశ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అయితే ఆయన ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయారా..? లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.