News April 16, 2025

ఖమ్మం: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలలో చేరాలి: అ.కలెక్టర్

image

పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వీటితోపాటు ప్రభుత్వ కేజీబీవీ, రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. వీటిలో 100 శాతం అడ్మిషన్లు జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

Similar News

News April 16, 2025

KMM: కోచ్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లా లోని మధిర, వైరా, కల్లూరు మినీ స్టేడియాల్లో క్రీడా కారులకు శిక్షణ ఇచ్చేందుకు గాను కోచ్‌ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువ జన, క్రీడల శాఖ అధికారి సునిల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల ఎన్ఐఎస్ శిక్షణ పొంది సర్టిఫికెట్ ఉన్న వారు, సీనియర్ క్రీడాకారులు ఈనెల 22 కల్లా తమ దరఖాస్తులను సర్దార్ పటేల్ స్టేడియంలోని కార్యాలయంలో అందజేయాలని కోరారు.

News April 16, 2025

అమెరికాలో అనారోగ్యంతో మధిర వాసి మృతి

image

మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వెలగపూడి రమేశ్ అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రమేశ్ అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రమేశ్ ఫ్రెండ్స్, తానా కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News April 16, 2025

ఖమ్మం: మున్నేరు ముంపు మళ్లీ రావొద్దు

image

ఖమ్మం నగరంలో మున్నేరు నదికి ఇరువైపులా 30 అడుగుల ఎత్తులో ఆర్సీసీ కాంక్రీట్ గోడలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఖమ్మం పట్టణంలోని ఆరు కాలనీలు, పాలేరు నియోజకవర్గంలోని రెండు కాలనీలను వరద సమయంలో రక్షించడానికి ఉపయోగపడతాయి. ఇప్పటికే అధికారులు సమీక్ష నిర్వహించి తగు చర్యలు ప్రారంభించారు.

error: Content is protected !!