News March 23, 2026

ఖమ్మం: విధుల్లో నిర్లక్ష్యం.. ఇన్విజిలేటర్‌ రిలీవ్

image

జిల్లాలో పదో తరగతి ఆంగ్ల పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. 99.89 శాతం హాజరు నమోదైనట్లు డీఈఓ చైతన్య జైని తెలిపారు. బోనకల్ జెడ్పీహెచ్ఎస్ కేంద్రంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్‌ను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 16,918 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని వివరించారు.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.