News January 14, 2026
ఖమ్మం: విభేదాలు వీడి.. ఎర్రజెండాలు ఏకమయ్యేనా?

కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం జిల్లాలో ఎర్రజెండా పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆయా పార్టీల ప్రభావం తగ్గుతోందన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. CPI, CPM, CPI ML, CPI ML న్యూడెమోక్రసీ, తదితర కమ్యూనిస్టు పార్టీల మధ్య విభేదాలు బలాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే CPI శతాబ్ది ఉత్సవాల వేదికగానైనా కమ్యూనిస్టు నేతలంతా ఒక్కతాటిపైకి వస్తారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Similar News
News February 3, 2026
క్యాన్సర్‌పై అవగాహన ప్రాణాధారం: జడ్జి సౌజన్య

క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పిలుపునిచ్చారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని నర్సింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News February 3, 2026
పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.
News February 3, 2026
దీపారాధన చేయాలంటే స్త్రీలు తల స్నానం చేయాలా?

వివాహితలు నిత్య దీపారాధనకై రోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. పాపటలో కుంకుమ ధరిస్తే తలస్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. స్త్రీల పాపటలో గంగాదేవి ఉంటుందని, అక్కడ కుంకుమ ధరిస్తే పవిత్రతను ఇస్తుందని నమ్మకం. అయితే వ్రతాలు, పూజలు, దీక్షల సమయంలో మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలాగే దీపారాధన చేస్తే ఎవరికీ ఎంగిలి పదార్థాలు పెట్టకూడదు. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.


