News April 8, 2025
ఖమ్మం: వివాహేతర సంబంధం.. వ్యక్తి ప్రాణం తీసింది!

మహిళ క్షణికావేశంలో ఓ వ్యక్తిని నెట్టివేయడంతో గోడకు తగిలి మృతిచెందిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖానాపురం పోలీసుల వివరాలిలా.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలానికి చెందిన రవిప్రసాద్ గత కొద్దిరోజులుగా ఖమ్మం నగరంలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. రవిప్రసాద్‌ను పక్కకు నెట్టివేయడంతో తలకు గాయాలై మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News April 17, 2025
ఖమ్మం: నేటి నుంచి భూభారతిపై అవగాహన సదస్సు

ఖమ్మం జిల్లాలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై ఈనెల 17 నుంచి 30 వరకు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు 2 మండల కేంద్రాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. కొత్త ఆర్ఓఆర్ చట్టం అమలుపై సమగ్రంగా అధికారులు వివరిస్తారని, ప్రజలకు ఏలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చునని ఆమె సూచించారు.
News April 16, 2025
ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి

ఖమ్మం జిల్లా ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది. మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో తమ ప్రాంతాల్లో విద్యుత్తు లైన్ల పై చెట్టుకొమ్మలు లేదా స్తంభాలు విరిగిపడినట్లు ఉంటే వెంటనే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలు ఉంటే 1912 నంబర్ కు కాల్, లేదా విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని విద్యుత్ అధికారులు ప్రకటించారు.
News April 16, 2025
ఖమ్మం: తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: ఇన్‌ఛార్జ్ కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల విషయమై అర్హులై, ప్లాట్లు ఉన్న ఎల్1 జాబితాను ఎంపీడీవో సంతకంతో తీసుకుని ఆమోదం కోసం ఇందిరమ్మ కమిటీ ముందు ఉంచాలని సూచించారు. అలాగే వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటికి ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.