News January 15, 2026

ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

image

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్‌ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్‌ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.

Similar News

News February 18, 2026

మధిర: ఇద్దరు హెచ్‌ఎంలపై వేటు

image

మధిరలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గర్ల్స్ హైస్కూల్ HM హైమావతిని వరంగల్ ఆర్జేడీకి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కలెక్టర్ తనిఖీలో లోపాలు గుర్తించినట్లు సమాచారం. అలాగే ఎంపీపీఎస్ గర్ల్స్ స్కూల్ HM కెబిఎస్ రాజును వేంసూర్‌కు బదిలీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వల్లే ఈ చర్యలని డీఈవో జైని తెలిపారు.

News February 18, 2026

ఖమ్మం: వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు తప్పనిసరి

image

ఖమ్మం (D)లో రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఇకపై రాత్రి వేళల్లో వాహనాలు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేస్తూ కొత్త రూల్ తెచ్చింది. క్యూఆర్ కోడ్ లేని వాహనాలకు ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేయమని RTO జగదీష్ స్పష్టం చేశారు. రాత్రి సమయాల్లో నిలిపి ఉంచిన లారీల వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు.

News February 18, 2026

ఖమ్మం: న్యాయవాది నుంచి కౌన్సిలర్‌గా

image

కోర్టులో కేసులు వాదించే స్థాయి నుంచి ప్రజల పక్షాన నిలిచే ప్రజాప్రతినిధిగా అడ్వకేట్ దండి శ్రీజ బాధ్యతలు చేపట్టారు. ఎదులాపురం మున్సిపాలిటీ 30వ వార్డు కౌన్సిలర్‌గా సీపీఐ తరపున విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఖమ్మం జిల్లాలో న్యాయవాదిగా సేవలందించిన శ్రీజ, ఇప్పుడు ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, మిత్రులు ఆమెను అభినందించారు.