News June 28, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకురావొద్దని అధికారులు సూచించారు. సోమవారం యథావిధిగా మార్కెట్ ఓపెన్ అవుతుందన్నారు.
Similar News
News December 17, 2025
ఖమ్మంలో తుది విడత ఎన్నికలు.. 9AM UPDATE

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 మండలాలు కలిపి ఉ.9 గంటల వరకు 27.45% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
☆ ఏన్కూరు-25.24%
☆ కల్లూరు- 28.33%
☆ పెనుబల్లి-31.52%
☆ సత్తుపల్లి- 23.63%
☆ సింగరేణి-25.71%
☆ తల్లాడ- 28.55%
☆ వేంసూరు- 27.38%
◇ ఎన్నికల అప్డేట్ కోసం WAY2NEWS ను చూస్తూ ఉండండి.
News December 17, 2025
ఖమ్మం: ‘ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి’

ఖమ్మం జిల్లా గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం TG-CET 2026 నిర్వహించనున్నట్లు DCO సిహెచ్.జ్యోతి తెలిపారు. పరీక్ష ఫిబ్రవరి 22 (ఆదివారం) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఉచిత విద్య, వసతి, భోజనం అందించే ఈ గురుకులాల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు జనవరి 21వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
News December 17, 2025
ఖమ్మం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయింపు

ఖమ్మం జిల్లా రేషన్ లబ్ధిదారులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి శుభవార్త తెలిపారు. రేపటి నుంచి 22 వరకు జిల్లాలోని చౌక ధరల దుకాణాల్లో బియ్యం లభిస్తాయని ప్రకటించారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించి, షాపులకు సరఫరా చేశామని తెలిపారు. లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల రేషన్ షాపుల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని కోరారు.


