News July 26, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మూడు రోజులు బంద్ ఉంటుందని మార్కెట్ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 27 శనివారం వారంతపు యార్డు, 28 ఆదివారం వారంతపు సెలవు, 29 సోమవారం బోనాల పండుగ సందర్భంగా బంద్ ఉంటుందన్నారు. ఈనెల 30న మంగళవారం రోజున
మార్కెట్ పునఃప్రారంభం అవుతుందన్నారు.

Similar News

News December 22, 2025

ఖమ్మం @ 8,095

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 8,095 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ అదాలత్‌లో అత్యధికంగా 6,394 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 999 క్రిమినల్, 370 చెక్ బౌన్స్, 144 బ్యాంక్, 37 సైబర్, కుటుంబ తగాదాలు 20, ఈపీలు 09 పరిష్కారమైయ్యాయి. రాజీ మార్గమే రాజమార్గమని, దీనివల్ల కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని న్యాయాధికారులు పేర్కొన్నారు.

News December 22, 2025

ఖమ్మంలో ‘శిల్పారామం’

image

ఖమ్మంలో శిల్పారామం ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. ఖానాపురం హవేలీ పరిధిలోని సర్వే నం. 94, 234లో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారులు పరిశీలన పూర్తి చేశారు. శిల్పారామం ముఖద్వారానికి సంబంధించిన నమూనాను తక్షణమే సిద్ధం చేసి, పనులను పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరం పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.

News December 21, 2025

రేపు వరదలు, ప్రమాదాలపై మాక్ డ్రిల్

image

వరదలు, పరిశ్రమల ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు సోమవారం ఖమ్మం నయాబజార్లోని ZPSS, జనరల్ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మాక్ డ్రిల్ జరగనున్నందున ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇందులో 50 మంది చొప్పున ఆపద మిత్ర వలంటీర్లు, 20 మంది NCC కేడెట్లు పాల్గొంటారని తెలిపారు.