News June 12, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ కింద విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,100 పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,000 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.100, అటు పత్తి ధర రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. కాగా మార్కెట్లో రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా క్రయవిక్రయాలు జరపాలని అధికారులు సూచించారు.
Similar News
News November 29, 2024
REWIND: మలిదశ ఉద్యమానికి పురుడుపోసిన ఖమ్మం గడ్డ!
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ మలిదశ ఉద్యమంలో భాగంగా KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి ఊపిరి పోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నాటి కేసీఆర్ దీక్షతో తెలంగాణ సుభిక్షం అయింది.
News November 29, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్ష దివస్ కార్యక్రమం∆} ఖమ్మంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ ర్యాలీ ∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లి మండలంలో మంచినీటి సరఫరా బంద్ ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో రుద్రాభిషేకం ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
News November 29, 2024
KMM: డ్రగ్స్ నియంత్రణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్
జిల్లాలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ ప్రాధాన్యత అంశంగా అధికారులు పని చేయాలని, ఈ దిశగా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి కలెక్టరేట్ లోని తన ఛాంబర్‌లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.