News March 21, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.20,100 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,450 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర స్థిరంగా కొనసాగుతుండగా, పత్తి ధర మాత్రం రూ.100 తగ్గినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

Similar News

News December 22, 2025

ఖమ్మం జిల్లాలో రూ.68కోట్లకు పైగా బోనస్: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 331 కొనుగోలు కేంద్రాల ద్వారా 43,236 మంది రైతుల నుంచి 2,51,847 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 90 శాతం రైతులకు రూ.530 కోట్లకు పైగా చెల్లింపులు చేశామని చెప్పారు. సన్న వడ్లకు రూ.68 కోట్లకు పైగా బోనస్ అందించామన్నారు.

News December 22, 2025

పాలన వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికలు ముగిసినందున పాలన వ్యవహారాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలను నిబద్దతతో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో మండల ప్రత్యేక అధికారులుగా కీలకపాత్ర పోషించిన అధికారులకు కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

News December 22, 2025

పర్యాటక ప్రాంతాల వివరాలు పంపండి: ఖమ్మం కలెక్టర్

image

అన్ సీన్ పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. నేచర్, వైల్డ్ లైఫ్, హెరిటేజ్, వాటర్ బాడీస్, స్పిరిచువల్, అడ్వెంచర్, ఆర్ట్ అండ్ కల్చర్ వంటి విభాగాల్లోని ప్రదేశాల వివరాలను జనవరి 5లోపు పంపాలని సూచించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.