News November 29, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటాలు ఏసీ మిర్చి ధర రూ.16,325 జెండా పాట పలకగా, క్వింటాలు పత్తి ధర రూ.7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.75 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్‌కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
Similar News
News December 25, 2025
అంబేడ్కర్ వర్సిటీ పరీక్ష ఫీజు గడువు 27 వరకు

ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ కళాశాల అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ నెల 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ విద్యార్థులకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో జనవరి 7 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పీజీ సప్లిమెంటరీ విద్యార్థులు కూడా ఫీజు చెల్లించవచ్చన్నారు.
News December 24, 2025
సాగర్ కాలువలో విషాదం.. ఒక విద్యార్థి మృతదేహం లభ్యం

ఖమ్మం: సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థులలో ఒకరి ఆచూకీ దొరికింది. కొద్దిసేపటి క్రితం గాలింపు చర్యల్లో భాగంగా అబ్దుల్ సుహాన్ మృతదేహం లభ్యమైంది. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 24, 2025
అధికారుల నిర్లక్ష్యం సహించం.. ప్రజా సంక్షేమమే లక్ష్యం: Dy.CM

అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం అనుకున్న లబ్ధిదారుడికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని పేర్కొన్నారు.


