News April 3, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి, మిర్చి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,700 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,400 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.800 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.25 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు.
Similar News
News December 26, 2025
ఖమ్మంలో ఎన్ఐఏ సోదాలు జరగలేదు: పోలీసులు

ఖమ్మం నగరంలోని విద్యాసంస్థల యజమానుల ఇళ్లపై <<18670988>>జాతీయ దర్యాప్తు సంస్థ<<>>(NIA) సోదాలు నిర్వహించినట్లు వస్తున్న వార్తలను స్థానిక పోలీసులు ఖండించారు. పాలస్తీనా సంఘీభావ ర్యాలీ నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగినట్లు ప్రచారం జరగగా, అందులో వాస్తవం లేదన్నారు. అయితే, 5 రోజుల క్రితం సీబీఎస్ఈ ప్రాంతీయ అధికారి ఒకరు పాఠశాలలను సందర్శించి, నిబంధనల అమలుపై ఆరా తీసినట్లు సమాచారం. తప్పుడు వార్తలను నమ్మవద్దని అధికారులు సూచించారు.
News December 25, 2025
ఖమ్మంలో విషాదం నింపిన ఘటనలు

ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన అబ్దుల్ సుహాన్, శశాంక్ అనే మిత్రులు కొట్టుకుపోయారు. నాయకన్‌గూడెంలో మరో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో ఆడుకుంటూ కిందపడగా జేబులోని పెన్సిల్ ఛాతికి గుచ్చుకుని విహార్ అనే చిన్నారి మృతి చెందాడు.
News December 25, 2025
మెడికల్ ఆఫీసర్ అభ్యంతరాలకు 27 వరకు గడువు

జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖమ్మం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు DM&HO తెలిపారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేటి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత ధ్రువపత్రాలతో DM&HO కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.


