News March 18, 2025
ఖమ్మం: శరవేగంగా ‘అమృత్’ నిర్మాణ పనులు

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతోఅమృత్ 2.0 నిధుల నుంచి మంజూరైనరూ.249 కోట్ల వ్యయంతో ఖమ్మం నగరంలో చేపట్టిన అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులను సోమవారం మేయర్ పునుకొల్లు నీరజ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖానాపురం ఊర చెరువు నుండి రామకృష్ణాపురం మున్నేరు వరకు చేరిన మురుగు నీరును అక్కడ ఎస్టిపిలో శుద్ధిచేసి మున్నేరులో వదలడం జరుగుతుందని ఈఈ రంజిత్ కుమార్ తెలిపారు.
Similar News
News March 18, 2025
రైళ్లు ఆలస్యం.. ప్రయాణికులు పడిగాపులు..!

ఖమ్మం మీదుగా వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 83 రైళ్లకు ఖమ్మంలో హాల్టింగ్ ఉంది. రైళ్లు రద్దయినప్పుడు కాకుండా మిగతా రోజుల్లో అన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మూడోలైన్ నిర్మాణ పనుల కారణంగా రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయని.. పనులు పూర్తయితే అన్ని రైళ్లు సమయానికి నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
News March 18, 2025
ఖమ్మం: ఇంటి వద్దకే రాములవారి తలంబ్రాలు: ఆర్ఎం

ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేసినట్లు ఖమ్మం RM సరిరామ్ తెలిపారు. దీనికోసం ఆన్లైన్ లేదా బస్టాండ్ సెంటర్లు మరియు ఏజెంట్ కౌంటర్ లో రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చున్నారు. మరిన్ని వివరాలకు ఖమ్మం :9154298583, మధిర :9154298584, సత్తుపల్లి:9154298585, భద్రాచలం:9154298586 కొత్తగూడెం&ఇల్లందు:9154298585, మణుగూరు: 9154298588 నంబర్లకు సంప్రదించాలన్నారు.
News March 18, 2025
ఖమ్మం: అండర్ పాస్‌కు రైల్వే మంత్రి హామీ

ఖమ్మం నగరంలోని రైల్వే మధ్య గేటు సమస్యకు శాశ్వత పరిష్కారానికి హామీ లభించింది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. మధ్య గేటు ప్రాధాన్యత, వ్యాపార, వాణిజ్య సంబంధాలు తదితర అంశాలపై ఆయన రైల్వే మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి మధ్య గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణం పై సాధ్యసాధ్యాలను పరిశీలించాలని రైల్వే ఉన్నతాధికారులకు సూచించారు.