News January 7, 2026
ఖమ్మం: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..?

సంక్రాంతి పండుగకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖమ్మం రీజియన్ ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 9 నుంచి 20 వరకు మొత్తం 1,368 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్‌ఎం సరిరామ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చే వారికోసం 799 బస్సులు, తిరుగు ప్రయాణంలో 569సర్వీసులు అందుబాటులో ఉంటాయని వివరించారు. వీటిలో 601బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 23, 2026
పొన్నూరు విద్యార్థికి రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్

గుంటూరు జోనల్ స్థాయిలో గురువారం జరిగిన స్పెల్ బీ పోటీలలో పొన్నూరు విద్యార్థి పొట్లూరి దేవేశ్ ప్రథమ స్థానంలో నిలిచాడు. పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న దేవేశ్ జోనల్ స్థాయిలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయిలో 4వ తరగతి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. దీంతో విద్యార్థి దేవేశ్‌ను మండల విద్యాశాఖ అధికారులు ధూపం రాజు, కొల్లి విజయభాస్కర్, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు అభినందించారు.
News January 23, 2026
బాపట్ల: గుడ్ న్యూస్.. రూ.50 వేల సబ్సిడీతో రుణాలు

జిల్లాలోని SC స్వయం సహాయక సంఘం సభ్యులకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం అజయ్ పథకం కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు DRDA PD సింగయ్య గురువారం తెలిపారు. జిల్లాలో 183 మందికి లబ్ధి చేకూరనుందన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ.50 వేల సబ్సిడీ, మిగతా మొత్తం వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. 20-35 ఏళ్ల వయసు ఉండి, కొత్త యూనిట్లు స్థాపించే వారు ఈనెల 24లోపు స్థానిక వెలుగు కార్యాలయలలో సంప్రదించాలని సూచించారు.
News January 23, 2026
MEGA 158లో చిరు సరసన ప్రియమణి!

చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు బాబీ డైరెక్షన్‌లో రాబోతున్న ‘మెగా 158’ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


