News January 9, 2026

ఖమ్మం: సంక్రాంతి వేళ తస్మాత్ జాగ్రత్త: సీపీ

image

సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే వారు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ సూచించారు. నగలు బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎక్కువ రోజులు తాళం వేసి వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. ప్రయాణాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

Similar News

News February 19, 2026

ఖమ్మం: రిటైర్మెంట్ బకాయిలు అందక విశ్రాంత ఏఆర్‌ఎస్‌ఐ మృతి

image

ఖమ్మం పోలీస్ సాయుధ దళంలో 35 ఏళ్లు సేవలందించి 2025 ఫిబ్రవరిలో రిటైరైన ఏఆర్‌ఎస్‌ఐ కే.మైసయ్య కన్నుమూశారు. రిటైర్మెంట్ బకాయిలు అందక ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేక ఆయన మరణించడం విషాదం నింపింది. విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేసింది. బకాయిల విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు.

News February 19, 2026

పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు: సీపీ

image

ఖమ్మం జిల్లాలోని 66 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు సెక్షన్ 163 (BNSS యాక్ట్) అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. పరీక్షల సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేంద్రాలకు 200 మీటర్ల లోపు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని ఆదేశించారు. ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 19, 2026

చిరుప్రాయంలో గుండెకోత.. ఆదుకోండి

image

వైరా(M) తాటిపూడికి చెందిన కట్టా రామకృష్ణ మూడేళ్ల కుమారుడు శ్రీహర్ష ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.18రోజులుగా గుండెసమస్యతో బాధపడుతున్న ఈ చిన్నారి,HYDలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి రూ. 22.70 లక్షలు ఖర్చవుతాయని, అంత స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉదారహృదయులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.