News March 1, 2025
ఖమ్మం: సంక్షేమ బోర్డును ఎత్తివేసే కుట్ర: ప్రవీణ్

తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఖమ్మం జిల్లా 4వ మహాసభలు శనివారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. సంఘం జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన మహాసభలో వారు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసి తెచ్చిన సంక్షేమ బోర్డును ఈ ప్రభుత్వం ఎత్తివేయాలనే కుట్ర పన్నుతుందని ఆరోపించారు.
Similar News
News March 2, 2025
ఖమ్మం: కానిస్టేబుల్‌ను అభినందించిన సీపీ

టాటా అల్ట్రా మారథాన్ 50 కిలోమీటర్ల రన్‌లో మెడల్ సాధించిన కానిస్టేబుల్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం అభినందించారు. రాష్ట్రం, దేశంలో ఎక్కడ మారథాన్ నిర్వహించినా పాల్గొంటూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధిస్తున్నట్లు ఖమ్మం ఏఆర్ కానిస్టేబుల్ పిల్లి రాజు తెలిపారు. గత నెల 23న పూణె సమీపంలోని లోనావాలా సయ్యాద్రి కొండలల్లో మారథాన్ రన్ 50 కిలోమీటర్లను 6గంటల 39 నిమిషాల్లో పూర్తి చేశారని చెప్పారు.
News March 2, 2025
ఖమ్మం: దివ్యాంగులకు ఆ కార్డులు తప్పనిసరి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ప్రతి దివ్యాంగుడికి యూనిక్ డిజేబిలిటీ ఐడీ నంబర్ జనరేట్ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ అన్నారు. మార్చి 1 నుంచి సదరం సర్టిఫికెట్ విధానాన్ని రద్దు చేసి, యూడీ ఐడీ. కార్డులు జారీ చేయనున్నారు. నూతన దివ్యాంగులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, సదరం ఉన్నవారికి డీఆర్‌డీవోల ద్వారా యూడీ ఐడీ కార్డు జారీ చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగపడుతోందని తెలిపారు.
News March 1, 2025
BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.